New Year Celebration Beaches: న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:02 PM
న్యూ ఇయర్ పార్టీని బీచ్ వద్ద సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇండియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం వేడుకలు దగ్గరపడుతున్నాయి. ఈ సారి న్యూ ఇయర్‌ను స్పెషల్‌గా, మరిచిపోలేని అనుభూతిగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇండియాలోని అద్భుతమైన బీచ్‌లు మీ సెలబ్రేషన్స్‌కు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తాయి. ఇసుక తీరాలు, నీలిరంగు అలల సవ్వడులు, నైట్ పార్టీలు, బీచ్ ఫుడ్ ఇలా ఇండియాలోని పలు బీచ్‌లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు పర్ఫెక్ట్ స్పాట్‌గా మారాయి. ఈ బీచ్‌లు మీ న్యూ ఇయర్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేస్తాయి.
అండమాన్ లోని రాధానగర్ బీచ్
భారతదేశంలోని అత్యంత అందమైన బీచ్‌ల విషయానికి వస్తే, అండమాన్ దీవులలోని రాధానగర్ బీచ్ అగ్రస్థానంలో ఉంది. ఇది ఆసియాలోనే అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి. ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలనుకునేవారికి ఈ అద్భుతమైన బీచ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

కేరళలోని చెరై, వర్కాల బీచ్‌లు
కేరళలోని అద్భుతమైన ప్రకృతి అందాలు, సుందరమైన బీచ్‌లు, దట్టమైన పచ్చదనం, హిల్ స్టేషన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు దీనిని సందర్శించడానికి ఆకర్షితులవుతారు. ప్రకృతి ప్రేమికులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి చెరై బీచ్ సరైన ప్రదేశం. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మీకు గోవా లాంటి అనుభూతిని ఇస్తుంది.

కర్ణాటకలోని గోకర్ణ బీచ్
కర్ణాటకలో ఉన్న గోకర్ణ బీచ్‌లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అద్భుతమైన ఎంపిక. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఓం బీచ్, కుడ్లే బీచ్, హాఫ్-మూన్ బీచ్ వంటి తీరాలు ప్రత్యేకంగా ఉంటాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడి బీచ్ కేఫ్‌లు లైవ్ మ్యూజిక్, బోన్‌ఫైర్ పార్టీలు నిర్వహిస్తాయి. రాత్రి బీచ్ వైబ్ మొత్తం ఫుల్ ఫన్‌తో ఉంటుంది. ఎంతో సందడిగా, సంగీతంతో సరదాగా బాగా ఎంజాయ్ చేస్తారు.

గుజరాత్‌లోని మాండ్వి బీచ్
మీరు నూతన సంవత్సరాన్ని బీచ్ వద్ద సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, అంతగా రద్దీ లేకుండా ప్రశాంతమైన ప్రదేశం కావాలనుకుంటే గుజరాత్‌లోని మాండ్వి బీచ్ మీకు పర్ఫెక్ట్ చాయిస్. ప్రశాంతమైన వాతావరణంతో ఈ అందమైన బీచ్ మీకు రిలాక్సింగ్ ఫీల్ కలిగిస్తుంది. కుటుంబం, ఫ్రెండ్స్ లేదా కపుల్స్‌కి ఈ బీచ్ చాలా బాగుంటుంది.

మీరు న్యూ ఇయర్ పార్టీని బీచ్ వద్ద సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ నుండి విమాన ప్రయాణం కోసం, మీరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (HYD) నుండి ఆయా రాష్ట్రాలకు వెళ్లి హ్యాపీగా ఎంజాయి చేసి రావచ్చు.
Also Read:
హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..
జీవితంలో ఈ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి..
For More Latest News