Telangana CMO Bomb Threat: హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:08 AM
తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. CMO, లోక్ భవన్‌ను పేల్చేందుకు కుట్ర చేస్తున్నారని గవర్నర్ కార్యాలయానికి ఖాన్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ భవన్, సీఎంవోను వెంటనే ఖాళీ చేయించాలని మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటినా బాంబు స్క్వాడ్‌తో సీఎంవో, లోక్ భవన్ వద్ద తనిఖీలు చేపట్టారు. అలాగే, బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుండి US వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు పేలకూడదంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఐసోలేషన్ బే దగ్గర ఫ్లైట్‌ని ఉంచి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా, ఆ మెయిల్ న్యూయార్క్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఈ మధ్య కాలంలో బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఎక్కువయ్యాయి. తరచూ మెయిల్స్ రావడం అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేయడం సర్వసాధారణంగా మారుతోంది.
Also Read:
మైనంపల్లి సంచలన కామెంట్స్.. కేటీఆర్ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News