Share News

Mynampally Hanumantha Rao: మైనంపల్లి సంచలన కామెంట్స్.. కేటీఆర్‌ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం

ABN , Publish Date - Dec 09 , 2025 | 10:58 AM

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. మాజీమంత్రి కేటీఆర్‌ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారన్నారు. కాళేశ్వరం, ఈ కార్, ఇలా అన్నింటా స్కామ్‌ చేసి పార్టీ ఫండ్‌ను కూడబెట్టుకున్నారని మైనంపల్లి అన్నారు.

Mynampally Hanumantha Rao: మైనంపల్లి సంచలన కామెంట్స్.. కేటీఆర్‌ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం

- ఐదేళ్లలో అన్ని హామీలు అమలు చేస్తాం

- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

హైదరాబాద్: సోషల్‌మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ మళ్లీ అమెరికాకు వెళ్లడం ఖాయమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆయన అన్నారు. కొంపల్లిలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతుందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని, ఐదేళ్ల లోపు మిగిలిన అన్ని హామీలను అమలు చేస్తామని అన్నారు.


కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారన్నారు. బీఆర్‌ఎస్‌(BRS) అధికారంలో కోల్పోయిన ఇంకా అధికారంలోనే ఉన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పది సంవత్సరాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం, ఈ కారు, ఇలా అన్నింటా స్కామ్‌ చేసి పార్టీ ఫండ్‌ను కూడబెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపించారు.


city7.2.jpg

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన విజ్ఞప్తి చేశారు. మెదక్‌ జిల్లాలో 240 గ్రామ పంచాయతీలు ఉంటే 15 మంది ఏకగ్రీవమయ్యారన్నారు. స్థానిక సంస్థల్లో 80శాతం స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీలోనూ కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో మెదక్‌, సిద్దిపేట జిల్లాల ఇన్‌చార్జి ముజాయిత్‌ అలీఖాన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్తకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 09 , 2025 | 10:58 AM