Home » KT Rama Rao
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాటరూపాల్లో సాగరహారం ఒకటని, నాటి సాగరహారానికి నేటితో 13 ఏళ్లు నిండాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జనింపడమే పనిగామారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్‌వేదికగా ఆరోపించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5000, మైనారిటీ విద్యాసంస్థల్లోని సిబ్బందికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంలో కోత విధించడం దారుణమని అన్నారు.
కాంగ్రెస్ పాలకులు తెలంగాణను మళ్లీ బానిసత్వంలోకి నెడుతున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరాడు. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే.. రాకుండా పారిపోయాడు.
భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు చోటు లేదా? తెలంగాణను తొలగించడంలో మీ ఉద్దేశం ఏంటి? అని బీజేపీ నేతలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డిలాగా తాము లేకిపనులు చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అడ్డమైన కేసులు పెట్టలేదని, ఇతర పార్టీల కార్యకర్తలను పోలీసులతో కొట్టించలేదని చెప్పారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు నమోదు కావడం రాష్ట్రానికే అవమానకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు.
చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణకు అంటగట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏడాది కిందట కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని ఆగం చేసిందని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డిది అబద్ధాల పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కానుకలకు కోత పెట్టిన రేవంత్ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారంటూ గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.