KTR: పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జలు నింపుతున్న కాంగ్రెస్..
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:28 AM
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జనింపడమే పనిగామారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్‌వేదికగా ఆరోపించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5000, మైనారిటీ విద్యాసంస్థల్లోని సిబ్బందికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంలో కోత విధించడం దారుణమని అన్నారు.
హైదరాబాద్,: తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జనింపడమే పనిగామారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గురువారం ఎక్స్‌వేదికగా ఆరోపించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5000, మైనారిటీ విద్యాసంస్థల్లోని సిబ్బందికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంలో కోత విధించడం దారుణమని అన్నారు. రూ.200 కోట్లతో అందాలపోటీలు పెట్టిన కాంగ్రె్‌సకు ఈ బక్కజీవులకు జీతమిచ్చేందుకు డబ్బు కరువైందా? అని ఆయన ప్రశ్నించారు.

మైనార్టీల గొంతుకోస్తున్న రేవంత్‌రెడ్డి
ఢిల్లీలోని బడేభాయ్‌ని సంతృప్తి పరిచేందుకు రేవంత్‌రెడ్డి మైనార్టీల గొంతు కోస్తున్నారని బీఆర్‌ఎస్(BRS) మైనార్టీ నేతలు ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ మైనార్టీ నేతలు ఇంతియాజ్ ఇసాక్ అహ్మద్, మసియుల్లాఖాన్, ఆజంఅలీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం మైనార్టీ గురుకులాల్లోని ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాల్లో కోతపెడుతోందన్నారు. ఈ నిర్ణయంతో 3500 మంది సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులజీతాలను తగ్గించేలా తెచ్చిన జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News