Share News

Gold and Silver Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:29 AM

ఈరోజు బంగారం, వెండి కొనాలని చూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే గత మూడు రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. అయితే ధరలు ఏ మేరకు తగ్గాయి, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Gold and Silver Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
Gold and Silver Prices drop September 19th

నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే (Gold Rates Today) వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే సెప్టెంబర్ 19, 2025న ఉదయం 6 గంటల సమయంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.1,11,160కి చేరింది. ఇది నిన్నటి ధరలతో (Gold and Silver Prices drop September 19th) పోలిస్తే దాదాపు రూ.540 తగ్గినట్లు కనిపిస్తోంది.

22 క్యారెట్ పసిడి 10 గ్రాములకు రూ.1,01,890గా ఉంది. ఇక వెండి ధరల్లో మరింత ఆసక్తికరంగా మార్పు వచ్చింది. హైదరాబాద్, కేరళలో కేజీ వెండి రూ.4,000 తగ్గి రూ.1,40,900కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


దేశవ్యాప్తంగా బంగారం ధరలు

దేశంలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు చాలా నగరాల్లో రూ.1,11,160 నుంచి రూ.1,11,480 మధ్య ఉంది. హైదరాబాద్‌లో రూ.1,11,160, ముంబై, కేరళ, పూణే, కోల్‌కతాలో కూడా ఇదే ధర. ఢిల్లీలో రూ.1,11,310, చెన్నైలో రూ.1,11,480గా ఉంది. ఇక్కడ మార్కెట్ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంది.

22 క్యారెట్ పసిడి విషయంలో హైదరాబాద్‌లో రూ.1,01,890, ముంబై, పూణే, కోల్‌కతా, కేరళలో కూడా ఇలాంటి ధరలే ఉన్నాయి. చెన్నైలో రూ.1,02,190గా కలదు. ఈ తగ్గుదల వెనుక అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు నిర్ణయాలు సహా పలు అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. నిన్నటి ధరతో పోల్చితే అనేక నగరాల్లో కిలో వెండి ధర రూ.4 వేలు తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్, చెన్నై, కేరళలో కేజీ వెండి రేటు రూ. 1,40,900, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, కేరళ, పూణే, వడోదరలో రూ. 1,30,900గా ఉంది. ఈ భారీ తగ్గుదల వెనుక అంతర్జాతీయ సిల్వర్ మార్కెట్‌లో సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడం సహా పలు అంశాలు కారణాలుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.


ఈ మార్పులు..

ఈ ధరల మార్పులు ఆసక్తికరంగా మారాయి. బంగారం తగ్గుదల కొనుగోలుదారులకు మేలు చేస్తుంది. మరోవైపు దసరా, దీపావళి సీజన్ ముందు వెండి భారీగా తగ్గడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా కూడా మారుతోంది. అయితే వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశాల అంశాలను కూడా ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకోవాలి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:56 AM