Share News

KTR: ఉద్యమ ప్రస్థానంలో గుర్తుండిపోయే.. సాగరహారం

ABN , Publish Date - Oct 01 , 2025 | 07:07 AM

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాటరూపాల్లో సాగరహారం ఒకటని, నాటి సాగరహారానికి నేటితో 13 ఏళ్లు నిండాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

 KTR: ఉద్యమ ప్రస్థానంలో గుర్తుండిపోయే.. సాగరహారం

- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాటరూపాల్లో సాగరహారం ఒకటని, నాటి సాగరహారానికి నేటితో 13 ఏళ్లు నిండాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Working President KTR) మంగళవారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఆంక్షలు ఎదిరించి, నిర్బంధాలను ఛేదించి, రబ్బర్‌బుల్లెట్లకు ఎదురొడ్డి ఉద్యమకారులు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగాచాటిన ఉద్వేగభరిత ఘట్టం సాగరహారమని తెలిపారు.


city1.3.jpg

ఉద్యమకారులను అడ్డుకుందామన్న సమైక్యపాలకుల కుట్రలను పటాపంచలుచేస్తూ లక్షలాదిమంది తెలంగాణబిడ్డలు జై తెలంగాణ అని కవాతుచేస్తూ ఉద్యమస్ఫూర్తిని గొంతెత్తి చాటిన ఉద్విగ్న సందర్భమది అంటూ కేటీఆర్‌ వెల్లడించారు.


city1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2025 | 07:07 AM