Share News

Corruption Cases: 9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:23 AM

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తెలంగాణలో దూకుడు పెంచారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 203కి పైగా కేసులు నమోదు...

Corruption Cases: 9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

  • రూ.58 కోట్ల మేర ఆస్తుల గుర్తింపు

  • మార్కెట్‌ విలువ రూ.500 కోట్లకు పైనే

  • తెలంగాణలో దూకుడు పెంచిన ఏసీబీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తెలంగాణలో దూకుడు పెంచారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 203కి పైగా కేసులు నమోదు చేసి 189 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులను అరెస్టు చేశారు. ట్రాప్‌ కేసులు, ఆదాయానికి మించి ఆస్తుల కేసులు, ఆకస్మిక తనిఖీలు, క్రిమినల్‌ మిస్‌ కండక్ట్‌ కేసులు, అంతర్గత విచారణల సందర్భంగా ఈ ఏడాది మొత్తం 203 కేసుల్లో తదుపరి చర్యల నిమిత్తం తుది నివేదికలను ప్రభుత్వానికి పంపించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ట్రాప్‌ కేసుల్లో రూ.42,03,500 స్వాధీనం చేసుకున్నామని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.58,36,18,724 గుర్తించామని, కేవలం ఇదీ డాక్యుమెంట్ల విలువ మాత్రమేనని, మార్కెట్‌ విలువ ఈ ఆస్తులది రూ.500 కోట్లు పైన ఉండొచ్చని అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 03:23 AM