Home » New Year
న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా రాత్రి బాగా తాగి హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే, అలాంటి వారి కోసం కొన్ని డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి. ఈ సహజ పానీయాలు విషాన్ని బయటకు పంపి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నూతన సంవత్సర వేడుకలను హనుమకొండ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఒకరికొకరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన వినూత్న కార్యక్రమంలో అధికారులు పాలుపంచుకున్నారు.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఆడ, మగ అన్న తేడా లేకుండా మందు తాగి రచ్చ రచ్చ చేశారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గురుగావ్‌లో నిన్న రాత్రి దారుణమైన పరిస్థితులు వెలుగు చూశాయి. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువతీ, యువకులు పెద్ద ఎత్తున మందు తాగి నడిరోడ్లపై రచ్చ రచ్చ చేశారు.
కొత్త ఏడాది వేళ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.
న్యూ ఇయర్ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. సెలబ్రేషన్స్ కి వచ్చిన వాళ్లంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది.
మల్లెపూలు కిలో రూ.3 వేలంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్పిందేమరి. నూతన సంవత్సరం మల్లె రైతులను, వ్యాపారులకు ఆదుకుందని చెప్పవచ్చు. రాజధాని నగరం చెన్నైతోపాటు ముఖ్య పట్టణాల్లో కిలో మల్లెపూలు రూ. 2,500 నుంచి రూ. 2 వేల వరకు విక్రయించారు.
నూతన సంవత్సరం వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. గత రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్ల విలువైన మద్యం సేల్ అయింది.
న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్న సందర్భంగా ఒక పబ్‌లో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అద్భుత అనుభూతిని మిగులుస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.