New Year: ఈ దేశాల్లో న్యూఇయర్ ఇంకా జరగలేదు.. ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:08 PM
ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ ఇంకా రాలేదు. వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఒక్క న్యూ ఇయర్ మాత్రమే కాదు.. క్రిస్మస్ కూడా జరుపుకోలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అనుసరించే ‘గ్రెగోరియన్ క్యాలెండర్’ (Gregorian calendar) ప్రకారం జనవరి 1న నూతన సంవత్సరం (New Year) వస్తుంది. కానీ, కొన్ని దేశాల్లో వారి సంస్కృతులు(Cultures), ఆచారాల ప్రకారం సొంత క్యాలెండర్ల(Calendars)ను అనుసరిస్తారు. ప్రపంచం మొత్తం జనవరి మొదటి వారంలో ఉంటే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఇంకా డిసెంబర్‌లోనే ఉన్నారు. జనవరి 6న అక్కడి ప్రాంత ప్రజలు క్రిస్మస్ వేడుకలు జరుపుకోబోతున్నారు. వింటానికి కాస్త ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం. అసలు విషయానికి వస్తే.. స్కాట్లాండ్‌లోని ఫౌలా అనే చిన్న ద్వీపంలో ఇప్పటికీ పాత జూలియన్ క్యాలెండర్‌నే పాటిస్తున్నారు. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు రేపు (మంగళవార) జనవరి 6న జరుపుకుంటారు. కొత్త ఏడాది వేడుకలు జనవరి 13న నిర్వహిస్తారు.
వాస్తవానికి బిట్రన్ దేశం 1752 లోనే తమ క్యాలెండర్ ని మార్చింది. ఇప్పటికీ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ, ఫౌలా ద్వీపవాసులు మాత్రం ఇంకా పాత క్యాలెండర్‌నే ఫాలో అవుతున్నారు. ఒక్క ఫౌలా ద్వీపంలోనే కాదు, రష్యా, ఇథియోపియా, సైబీరియా మరికొన్ని దేశాల్లో ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు. చైనా, వియత్నాం, కొరియా వంటి దేశాల్లో చంద్రుడి గమనం ఆధారంగా ‘లూనార్ న్యూ ఇయర్’ (Lunar New Year) జరుపుకుంటారు. చైనాలో న్యూ ఇయర్ 2026 ఫిబ్రవరి 17న వస్తుంది. దీనిని చైనాలో ‘స్ప్రింగ్ ఫెస్టివల్’ అని పిలుస్తారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
హసీనాను కూడా పంపేయండి.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు అసదుద్దీన్ ఓవైసీ మద్దతు