Owaisi Reacts To BCCIs Ban: హసీనాను కూడా పంపేయండి.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు అసదుద్దీన్ ఓవైసీ మద్దతు
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:46 AM
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రిలీవ్ చేయాలని ‘ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)’ దాని సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండలు జరుగుతున్న నేపథ్యంలో ‘ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)’ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రిలీవ్ చేయాలని దాని సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రాజకీయాలను, క్రీడలను కలపొద్దని హితవు పలికారు. ఇప్పుడు ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. రెహ్మాన్‌కు మద్దతుగా నిలిచారు.
అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ‘పహల్గామ్ దాడి తర్వాత మనం పాకిస్థాన్‌తో ఏషియా కప్ క్రికెట్ ఆడాము. మీరు బంగ్లాదేశ్ పేసర్‌ను వెనక్కు పంపించేశారు. ఓ బంగ్లాదేశీ మహిళ ఇండియాలో నివసిస్తోంది. ఆమెను కూడా వెనక్కు పంపండి. ఎందుకు ఆమెను ఇండియాలోనే నిలిపి వేశారు? బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఇండియాకు ముఖ్యం. చైనా, పాకిస్థాన్ బంగ్లాదేశ్‌లో యాక్టీవ్‌గా ఉన్నాయి. మనం దాని గురించి కూడా బాగా ఆలోచించాలి’ అని అన్నారు.
కాగా, బంగ్లాదేశ్‌లో 2024 జులై, ఆగస్టు నెలల్లో జరిగిన మారణహోమానికి కారణం అప్పటి ప్రధాని షేక్ హసీనానేనంటూ ఆమెను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 (ICT-1) దోషిగా తేల్చింది. హసీనాకు మరణ శిక్ష విధించింది. హసీనాకు మరణ శిక్ష వేయడాన్ని ఆమె కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇంతకు తెగించారని మండిపడ్డారు. తన తల్లి ఇండియాలో క్షేమంగా ఉంటుందని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జోయ్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి
ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?
ఒత్తిడిలో ఐటీ రంగం.. సూచీలకు స్వల్ప నష్టాలు..