2020 Delhi Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:10 PM
2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య ఈ అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ రోజు (సోమవారం) ఉదయం 2020 ఢిల్లీ అల్లర్ల కేసుతో సంబంధం ఉన్న పలువురు నిందితుల బెయిల్ పిటిషన్‌లపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌లపై ఉన్న తీవ్రమైన ఆరోపణలను న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకున్నారు. అల్లర్లలో మిగిలిన నిందితులకంటే ఈ ఇద్దరి పాత్ర ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. మిగిలిన ఐదుగురు నిందితులు ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మహ్మద్ షలీమ్ ఖాన్, షాదబ్ అహ్మద్‌లకు కండీషన్ బెయిల్ మంజూరు చేశారు. ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్‌లు ఈ రోజు నుంచి సరిగ్గా ఓ సంవత్సరం తర్వాత మళ్లీ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు.
కాగా, 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య ఈ అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. పోలీసుల వాదన ప్రకారం.. ఉమర్ ఖలీద్ అల్లర్లకు ముందు జరిగిన కొన్ని సమావేశాలు, ప్రసంగాల ద్వారా హింసకు దారితీసే కుట్రలో భాగస్వామి అయ్యాడు. శార్జీల్ ఇమామ్ కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటమే కాకుండా రహదారుల దిగ్బంధనాలకు ప్రేరేపించాడు.
ఇవి కూడా చదవండి
నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..
ఇంట్లో భార్యాభర్తల ఫోటోను ఏ దిశలో ఉంచాలి?