Home » Supreme Court
భారతదేశంలో కూడా పేదప్రజలు ఉన్నారని, వారు ఈ దేశ పౌరులని, వారికి నిర్దిష్ట ప్రయోజనాలు, సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నారా? వాళ్లపై ఎందుకు దృష్టి సారించరు? అని పిటిషనర్‌ను సీజేఐ ప్రశ్నించారు.
ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లు, సెలెబ్రిటీలు సైతం డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల బారిన పడుతున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.
సాధారణ సినిమాలు, షోలతో పోల్చుకుంటే ఓటీటీల్లో అశ్లీల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో వాటిని చూడడం చాలా ఇబ్బందికరం. ఓటీటీలపై ఈ విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది.
ఆధార్ కార్డును ఓటు వేసేందుకు ఒక హక్కుగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ల మీద అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.
ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
భూమిపై పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని ప్రేరేపించి పనిచేయిస్తున్న వారు అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 2020లో ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10న ఎర్రకోట పేలుడు ఘటన ఇందుకు నిదర్శనమని వివరించారు.