Share News

‘ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు.. పబ్లిసిటీ కావాలా’: సుప్రీంకోర్టు

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:47 PM

జన్ సురాజ్ పార్టీ వేసిన పిటిషన్‌ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించలేదు.

‘ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు.. పబ్లిసిటీ కావాలా’: సుప్రీంకోర్టు
Jan Suraaj Party

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌‌కు చెందిన జన్ సురాజ్ పార్టీపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను కోర్టు తప్పుబట్టింది. జన్ సురాజ్ పార్టీ వేసిన పిటిషన్‌ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించలేదు.


చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘మీ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి. ప్రజలు మిమ్మల్ని రిజక్ట్ చేశారు. మీరు న్యాయ స్థానాన్ని వాడుకుని పబ్లిసిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి స్పందిస్తూ.. ‘మీరది ఎలా అంటారు? మీరు అధికారంలోకి వచ్చినా అలానే చేస్తారు. మీరు హైకోర్టుకు వెళ్లకపోవడం వెనుక లాజిక్ ఏంటి? ఇదేమీ దేశ సమస్య కాదు. రాష్ట్రంలో ఓ హైకోర్టు ఉంది’ అని అన్నారు. ఇక, సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌‌ను బిహార్ హైకోర్టుకు రీడైరెక్ట్ చేసింది.


జన్ సురాజ్ పార్టీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో.. ‘ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున బదిలీ చేశారు. బీహార్ ప్రభుత్వం మోడల్ కోడ్‌ను ఉల్లంఘించింది. కూటమి ప్రభుత్వం గెలుపు చెల్లదని ప్రకటించాలి’ అని కోరింది. కాగా, గత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సమాజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.


ఇవి కూడా చదవండి

తెలంగాణలో పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం: మంత్రి సీతక్క

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

Updated Date - Feb 06 , 2026 | 03:13 PM