దుస్తులను లాగడమూ అత్యాచార యత్నమే.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఆగ్రహం..
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:30 PM
మహిళ వక్షోజాలను తాకడం, ఆమె పైజామా విప్పడానికి ప్రయత్నించడం అత్యాచారం కిందకు రాదంటూ కొన్ని రోజుల కిందట అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేయాలని నిర్ణయించింది.
మహిళ వక్షోజాలను తాకడం, ఆమె పైజామా విప్పడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం కిందకు రాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును రద్దు చేయాలని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. లైంగిక నేరాల కేసుల్లో తీర్పు ఇవ్వడానికి చట్టపరమైన తర్కంతో పాటు సానుభూతి కూడా అవసరమని పేర్కొంది (Supreme Court judgment).
అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని, వెంటనే జోక్యం చేసుకోవాలని వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని గత విచారణ సమయంలో విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా తుది తీర్పు వెలువరించింది. మహిళ వక్షోజాలను తాకడం, ఆమె పైజామా విప్పడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం కిందకు రాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది (pyjama string verdict).
అసలేం జరిగింది..
ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల (ఘటన జరిగిన సమయానికి) కూతురితో కలిసి 2021 నవంబర్‌లో బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తోంది. ఆ సమయంలో వారికి తెలిసిన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి బాలికను ఇంటి దగ్గర దింపుతామని చెప్పి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ఆ బాలికను ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లి అసభ్యంగా తాకడం మొదలుపెట్టారు. ఆమె వేసుకున్న దుస్తులను విప్పేందుకు ప్రయత్నించారు (SC latest ruling).
బాలిక గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్నవారు అక్కడకు వచ్చారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు జడ్డి (Allahabad High Court Judge).. బాలిక వక్షోజాలను తాకడం, దుస్తులను విప్పడానికి ప్రయత్నించడం అత్యాచారం కిందకు రాదని పేర్కొన్నారు. ఆ కేసును కొట్టేశారు. న్యాయమూర్తి వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో సుప్రీంకోర్టు ఆ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి..
ఇమ్రాన్ హత్యకు కుట్ర.. మమ్మల్ని మొహ్సిన్ బెదిరిస్తున్నారు.. మాజీ ప్రధాని సోదరీమణుల ఆరోపణలు..
మీ దృష్టికి పరీక్ష.. ఈ పార్క్‌లో ఉన్న పక్షిని 27 సెకెన్లలో గుర్తించండి..