Share News

TG News: నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:15 PM

నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. తెలంగాణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు..

TG News: నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..

న్యూఢిల్లీ, జనవరి 5: నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. తెలంగాణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేనందున ప్రాజెక్టు పనులు ఆపాలని.. ఆ మేరకు ఆర్డర్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ లేదా నల్లమల సాగర్‌ జలాశయానికి లింక్‌ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు చేపడుతోందని ఆరోపించింది. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని, పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని సుప్రీం ధర్మాసనాన్ని టి సర్కార్ అభ్యర్థించింది.


కేంద్రం అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని పిటీష‌న్‌లో తెలంగాణ సర్కార్ పేర్కొంది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్‌ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని తెలంగాణ వాదించింది. ఈ ప్రాజెక్టుపై తదుపరి చర్యలు చేపట్టరాదంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రిట్‌ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది.


బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును నిలిపివేయాలని పిటిషన్‌లో కోరింది. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల్ల సాగర్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఇదివరకే కేంద్ర జలశక్తి శాఖకు, జల వనరుల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయినప్పటికీ పోలవరం- నల్లమలసాగర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని సుప్రీంకోర్టును టీ సర్కార్ కోరింది.


Also Read:

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్‌రావుకు ఊరట

భగ్గుమంటున్న బంగారం, వెండి.. ధరలు ఎలా ఉన్నాయంటే..

వెనెజువెలాపై యూఎస్ స్ట్రైక్.. ముందే చెప్పిన షామన్లు..

Updated Date - Jan 05 , 2026 | 12:15 PM