Gold and Silver Rates hike: భగ్గుమంటున్న బంగారం, వెండి.. ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:44 AM
గత నాలుగు, ఐదు రోజులుగా కాస్త స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం గేర్ మార్చాయి. ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది.
గత నాలుగు, ఐదు రోజులుగా కాస్త స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం గేర్ మార్చాయి. ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 5న) ఉదయం పదకొండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 37, 400కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే 1,580 రూపాయలు పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 25, 950కి చేరింది (live gold rates). నిన్నటితో పోల్చుకుంటే రూ. 1,450 పెరిగింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1, 37, 550కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1, 26, 100కి చేరుకుంది.
మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది (silver prices hike). నిన్నటితో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.6 వేలు పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2.65 లక్షలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2.47 లక్షలకు చేరింది. బంగారం, వెండిలో లాభాల స్వీకరణ జరిగి ధరలు తగ్గొచ్చు అనే అంచనాలు వినిపించిన నేపథ్యంలో ఇలా పెరగడం చాలా మంది నిపుణులకు షాకిస్తోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..