Gold and Silver Rates Today: మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:30 AM
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారం బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 5న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 5న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,35,810కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,490కి చేరింది (live gold rates).
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,35,960కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1,24,640కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,810కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,24,490కి చేరింది(Gold price in Hyderabad). వెండి ధర కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం (gold market updates).
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
విజయవాడలో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
ఢిల్లీలో రూ. 1, 35, 960, రూ. 1, 24, 640
ముంబైలో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
వడోదరలో రూ. 1, 35, 860, రూ. 1, 24, 540
కోల్‌కతాలో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
చెన్నైలో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
బెంగళూరులో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
కేరళలో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
పుణెలో రూ. 1, 35, 810, రూ. 1, 24, 490
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2, 56, 900
విజయవాడలో రూ. 2, 56, 900
ఢిల్లీలో రూ. 2, 40, 900
చెన్నైలో రూ. 2, 56, 900
కోల్‌కతాలో రూ. 2, 40, 900
కేరళలో రూ. 2, 56, 900
ముంబైలో రూ. 2, 40, 900
బెంగళూరులో రూ. 2, 40, 900
వడోదరలో రూ. 2, 40, 900
అహ్మదాబాద్‌లో రూ. 2, 40, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు