Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:01 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు నాలుగు గంటలుగా ఆయన విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్, జనవరి 04: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగాన్ని సిట్ అధికారులు పెంచారు. ఈ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం సిట్ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు నాలుగు గంటలుగా ఆయన విచారణ కొనసాగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పరికరాలు (డివైజ్‌లు)లు ఉపయోగించి.. అప్పటి ప్రతిపక్షనేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారంటూ నవీన్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలోని పలువురి అగ్రనేతలతో నవీన్ రావుకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ అధికారులను ఈ నవీన్ రావు ఎలా ఉపయోగించుకున్నారనే అంశంపై ఆయనను సిట్ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది.
ఎక్కడెక్కడ పరికరాలు ఏర్పాటు చేసి.. ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డారనే అంశంపై ఆయన నుంచి సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. అలాగే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతోపాటు ఇదే కేసులో అరెస్టయిన మాజీ ఎస్ఐబీ అధికారులతో ఉన్న సంబంధాల గురించి నవీన్ రావు నుంచి సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుల బాధితులైన పలువురు రాజకీయ నేతల స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి సారి నవీన్ రావు స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. నవీన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా మరికొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ అధికారులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
రేవంత్ పాలనలో పాలమూరు ప్రజలకు నిరాశే మిగిలింది: ఎంపీ రఘునందన్
For More TG News And Telugu News