Share News

Venezuela oil sector: వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..

ABN , Publish Date - Jan 05 , 2026 | 07:12 AM

వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ చమురు రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో భారత చమురు కంపెనీలకు లాభం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Venezuela oil sector: వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..
Venezuela sanctions relief

శనివారం తెల్లవారుజామున వెనెజువెలాపై దాడి చేసిన అమెరికా దళాలు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అరెస్ట్ చేసి న్యూయార్క్‌కు తరలించిన సంగతి తెలిసిందే. వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ చమురు రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో భారత చమురు కంపెనీలకు లాభం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు (US-led takeover Venezuela oil).


వెనెజువెలా ఆయిల్ సెక్టార్‌ను అమెరికా టేకోవర్ చేస్తే భారత కంపెనీలకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు కావొచ్చు. వెనెజువెలా ప్రభుత్వం మన దేశ ఆయిల్ కంపెనీలకు ఒక బిలియన్ డాలర్లు (రూ.9000 కోట్లు) బకాయి పడింది. ఇప్పుడు వెనెజువెలా చమురు సెక్టార్ అమెరికా చేతుల్లోకి వెళ్తే ఆ బకాయిలకు మోక్షం లభించొచ్చు. అలాగే వెనెజువెలాలో మన దేశ కంపెనీలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి చమురు ఉత్పత్తి పెరిగే అవకాశం కూడా ఉంది. తూర్పు వెనెజువెలాలలోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రాన్ని ఓఎన్‌జీసీ విదేశ్ (40% వాటా) సంయుక్తంగా నిర్వహిస్తోంది (Venezuela crude oil India).


2020లో వెనెజువెలాపై అమెరికా ఆంక్షలు విధించడంతో శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రంలో ఉత్పత్తి తగ్గింది (Venezuela sanctions relief). ఆ చమురు క్షేత్రంలో భారీ చమురు నిల్వలున్నా బయటకు తీయడానికి ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవేళ అమెరికా ఆంక్షలు సడలిస్తే కీలకమైన టెక్నాలజీ, పరికరాలు, రిగ్‌లను అక్కడకు తరలించి ఉత్పత్తి పెంచే వీలు ఓఎన్‌జీసీకి కలుగుతుంది. ప్రస్తుతం శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రం నుంచి రోజుకు 5 నుంచి 10 వేల బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు అమెరికా ఆంక్షలు సడలిస్తే ఆ ఉత్పత్తి పది రెట్లు పెరగవచ్చు. అలాగే కారబోబో-1 క్షేత్రంలో కూడా ఓఎన్‌జీసీ‌కి 11% వాటా, ఐఓసీకి 3.5 శాతం, ఇండియన్ ఆయిల్‌కు 3.5 శాతం వాటా ఉంది.


ఇవీ చదవండి:

ఆ కంటెంట్‌ను తొలగిస్తాం.. అప్‌లోడ్ చేసిన అకౌంట్లను సస్పెండ్ చేస్తాం: ఎలన్ మస్క్

వెనెజువెలా నూతన అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ నియామకం

Updated Date - Jan 05 , 2026 | 08:37 AM