Share News

Venezuela New President Delcy Rodriguez: వెనెజువెలా నూతన అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ నియామకం

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:17 AM

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌ నియమితులయ్యారు. అమెరికా దాడుల నేపథ్యంలో సంక్షోభ పరిస్థితుల నడుమ ప్రభుత్వ పాలనా కొనసాగింపు, దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది.

Venezuela New President Delcy Rodriguez: వెనెజువెలా నూతన అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ నియామకం
Venezuela New president Delcy Rodriguez

ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాపై(Venezuela) అమెరికా దాడుల నేపథ్యంలో ఆ దేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా.. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది(Venezuela New President Delcy Rodriguez). ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro) సహా ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్‌(Cilia Flores)లను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ పరిస్థితుల్లో.. ప్రభుత్వ పాలన కొనసాగింపు, దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.


ఇదీ డెల్సీ నేపథ్యం..

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్Delcy Rodriguez).. నికోలస్ మదురోకు అత్యంత సన్నిహతురాలు. విప్లవ నేత, లిగా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు జార్జ్ ఆంటోనియో(George Antonio) కుమార్తె అయిన ఈమె.. 1969లో వెనెజువెలా రాజధాని కాకరాస్‌(Caracas)లో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ.. మదురో ప్రభుత్వంలో కమ్యూనికేషన్, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2018 నుంచి ఉపాధ్యక్షురాలిగా(Vice President) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోడ్రిగ్జ్.. తన సోదరుడు నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్‌తో(George Rodriguez)కలిసి మదురో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అలా ఆమె.. ఆ దేశ రాజకీయాల్లోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా పట్టు సాధించారు. దీంతో ఆమె ఆర్థిక, చమురు శాఖల మంత్రిగానూ సేవలందిస్తున్నారు.


అమెరికా ఆంక్షల నడుమ వెనెజువెలా దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతగానో కృషి చేశారు రోడ్రిగ్జ్. ఆ దేశంలోని చమురు కోసం ట్రంప్‌ సుంకాలు విధించిన వేళ.. ద్రవ్యోల్బణం నుంచి బయటపడేయడంలో కీలకపాత్ర పోషించారామె. ఇక.. రోడ్రిగ్జ్ నియామకం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మద్దతు ప్రకటించినట్టు సమాచారం.


ఇవీ చదవండి:

అమెరికాది స్టేట్ టెర్రరిజమ్.. క్యూబా ఘాటు వ్యాఖ్యలు

యూఎస్ డ్రగ్ ఏజెన్సీ ఆఫీసులో వెనిజువెలా అధ్యక్షుడు.. వీడియో..

Updated Date - Jan 04 , 2026 | 11:30 AM