Share News

US Strikes Venezuela: యూఎస్ డ్రగ్ ఏజెన్సీ ఆఫీసులో వెనిజువెలా అధ్యక్షుడు.. వీడియో..

ABN , Publish Date - Jan 04 , 2026 | 10:25 AM

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భారయ సిలియా ఫ్లోర్స్‌ అమెరికా భద్రతా దళాల అదుపులో ఉన్నారు. మదురోకి సంబంధించి వీడియోను యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ వీడియోను విడుదల చేశాయి.

US Strikes Venezuela: యూఎస్ డ్రగ్ ఏజెన్సీ ఆఫీసులో వెనిజువెలా అధ్యక్షుడు.. వీడియో..
US Venezuela tensions

న్యూయార్క్, జనవరి 4: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ అమెరికా భద్రతా బలగాల అదుపులో ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఫోటోను ట్రంప్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా వీడియోలు కూడా విడుదల చేశారు. మదురోని వెనిజువెలా నుంచి తీసుకువచ్చి.. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్(DEA) న్యూయార్క్ డివిజన్ కార్యాయలంలో నిర్బంధించినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.


శనివారం తెల్లవారుజామున వెనిజువెలా రాజధాని కారకాస్‌పై ప్రత్యేక అమెరికా దళాలు ఆకస్మిక దాడి జరిపాయి. ఈ దాడి సమయంలోనే ఆ దేశ అధ్యక్షుడు మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, యూఎస్ దాడి సమయంలో మదురో, ఆయన భార్య కారకాస్‌లోని హై సెక్యూరిటీ ఫోర్ట్ టియునా మిలిటరీ కాంపౌండ్‌లోని తమ నివాసంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడి విషయం తెలియగానే హైసెక్యూరిటీతో పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు.


రాపిడ్ రెస్పాన్స్‌ 47 టీమ్‌ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో మదురోకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో లోయర్ మాన్‌హట్టన్‌లోని ‘డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ న్యూయార్క్ డివిజన్ కార్యాలయం(DEA NYD)’ లోకి మదురోని అధికారులు తీసుకెళ్తున్నారు. చేతులకు సంకెళ్లతో సెక్యూరిటీ సిబ్బంది మధ్య బందీగా ఉన్నారు. కాగా, మదురోని ఓ గదిలోకి తీసుకెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బందికి ఆయన గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.


వెనిజువెలాపై దాడి తరువాత మదురో, ఆయన భార్యను ముందుగా అమెరికాలోని సైనిక స్థావరానికి తీసుకెళ్లారు. ఆ తరువాత అక్కడి నుంచి న్యూయార్క్‌కు తరలించారు. మదురోని డీఈఏ కార్యాలయం నుంచి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్తారని యూఎస్ మీడియా చెబుతోంది. మదురో, ఆయన భార్యపై నార్కో టెర్రరిజం, యునైటెడ్ స్టేట్స్‌లోకి టన్నుల కొద్దీ కొకైన్ దిగుమతి చేయడం, అక్రమ ఆయుధాలను కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపారు.


Also Read:

BJP: నో డౌట్.. గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం..

House fire Tadipatri: జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా.. తాడిపత్రిలో ఏం జరిగిందంటే..

Hyderabad: పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య

Updated Date - Jan 04 , 2026 | 10:55 AM