Share News

BJP: నో డౌట్.. గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం..

ABN , Publish Date - Jan 04 , 2026 | 10:11 AM

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచేగాక నగకం మొత్తంలో అత్యధఇక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆపార్టీ నేత రవికుమార్‌యాదవ్‌ అన్నారు.

 BJP: నో డౌట్.. గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం..

- బీజేపీ నేత రవికుమార్‌యాదవ్‌

హైదరాబాద్: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి రవికుమార్‌యాదవ్‌(Ravikumar Yadav) అన్నారు. హైదర్‌నగర్‌ డివిజన్‌ బూత్‌ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం పటేల్‌కుంట పార్కు పార్టీ కార్యాలయంలో డివిజన్‌ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది.


city6.jpg

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవికుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ.. పార్టీకి అసలైన బలం బూత్‌స్థాయి కార్యకర్తలేనన్నారు. ప్రతీ బూత్‌ పరిధిలో ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అందరిపై ఉందన్నారు.


city6.2.jpg

క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేస్తే విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌, కృష్ణంరాజు, సీనియర్‌ నాయకులు బాల్ద అశోక్‌, నవీన్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సీతారామరాజు, వేణుగోపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2026 | 10:11 AM