తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
ABN, Publish Date - Jan 03 , 2026 | 05:32 PM
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది జరిగే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తోంది.
1/6
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది జరిగే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తోంది.
2/6
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు జరిగాయి. ముఖ్య అతిథి జేఏసీ శ్యామలాదేవి హాజరై పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
3/6
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. ముగ్గు వేసి సెల్ఫీ దిగారు. అనంతరం, విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.
4/6
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా సెయింట్ ఆంటోని హైస్కూల్ ఆవరణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.
5/6
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయం విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో విజేతలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బహుమతులు అందజేశారు.
6/6
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాడ్రన్ హై స్కూల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు డిఈఓ ప్రవీణ్ కుమార్ బహుమతులు అందజేశారు.
Updated at - Jan 05 , 2026 | 03:56 PM