House fire Tadipatri: జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా.. తాడిపత్రిలో ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:44 AM
చలి కాలంలో వేడి నీటిని అందించే గీజర్ల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా మంది గాయాల పాలయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రిలో గీజర్ సిలిండర్ పేలిపోయింది
ప్రస్తుత చలికాలంలో అందరూ వేడినీటితో స్నానం చేయడానికే మొగ్గుచూపుతారు. చాలా మంది ఇళ్లలో వేడి నీళ్ల కోసం గీజర్ ఉపయోగిస్తుంటారు. వెచ్చని నీటిని అందించే గీజర్ల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా మంది గాయాల పాలయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రిలో గీజర్ సిలిండర్ పేలిపోయి భారీ ప్రమాదానికి కారణమైంది (geyser cylinder explosion).
తాడిపత్రిలో వేడినీటి కోసం వినియోగించే గీజర్ సిలిండర్ పేలి 8 మంది గాయాలపాలయ్యారు. గీజర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి ఇల్లు మొత్తమంతా వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి అంబులెన్స్‌ల ద్వారా స్థానిక హాస్పిటల్‌కు తరలించారు (fire breaks out in house).
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది (geyser blast news). ప్రస్తుతం క్షతగాత్రులంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫర్నిచర్ చాలా వరకు కాలిపోయింది. ఈ నేపథ్యంలో గీజర్ వాడేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. స్నానం చేసిన వెంటనే గీజర్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే గీజర్ ముందుగా ఆన్ చేసుకుని నీరు వేడెక్కిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి బాత్రూమ్‌లోకి వెళ్లడం మంచిదని చాలా మంది సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
న్యూయార్క్‌కు చేరుకున్న వెనుజువెలా అధ్యక్షుడు..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..