Share News

Venezuelan president New York: న్యూయార్క్‌‌కు చేరుకున్న వెనుజువెలా అధ్యక్షుడు..

ABN , Publish Date - Jan 04 , 2026 | 07:26 AM

వెనుజువెలా దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురోను, ఆయన సతీమణి సిలియా‌ను నిర్బంధంలోకి తీసుకుంది. యుద్ధ నౌక ఐవో జిమాలో మదురోను, ఆయన భార్యను న్యూయార్క్‌కు తరలించింది. కొద్ది సేపటి క్రితమే మదురో న్యూయార్క్‌కు చేరుకున్నారు

Venezuelan president New York: న్యూయార్క్‌‌కు చేరుకున్న వెనుజువెలా అధ్యక్షుడు..
Venezuelan president New York

శనివారం తెల్లవారుజామున అమెరికా సైన్యం 'ఆపరేషన్‌ అబ్జల్యూట్‌ రిజాల్వ్‌' పేరుతో వెనెజువెలాపై సైనిక చర్యకు దిగింది. బాంబుదాడులతో విరుచుకుపడింది. ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురోను, ఆయన సతీమణి సిలియా‌ను నిర్బంధంలోకి తీసుకుంది. యుద్ధ నౌక ఐవో జిమాలో మదురోను, ఆయన భార్యను న్యూయార్క్‌కు తరలించింది. కొద్ది సేపటి క్రితమే మదురో న్యూయార్క్‌కు చేరుకున్నారు (Nicolás Maduro arrest news).


బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు మదురోను, సిలియాను హెలికాఫ్టర్‌లో తీసుకెళ్తున్నట్టు సమాచారం. మాన్‌హట్టన్ ఫెడరల్‌ కోర్టులో డ్రగ్స్, ఆయుధాల కేసులో అమెరికా చట్టాల ప్రకారం మదురో, సిలియా విచారణను ఎదుర్కోబోతున్నారు. కాగా, వెనుజువెలాలో పరిస్థితులు సద్దుమణిగి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆ దేశాన్ని అమెరికానే పరిపాలిస్తుందని ట్రంప్ ప్రకటించారు (New York arrival Maduro).


యుద్ధ నౌకలో ఉన్న మదురో ఫొటోలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు (Maduro captured). ఆ ఫొటోలో మదురో కళ్లకు గంతలు ఉన్నాయి. తలపై హెడ్‌ఫోన్‌లు ఉన్నాయి. గ్రే ట్రాక్‌సూట్ ధరించి ఉన్నారు. మదురోను అమెరికా సైనికులు నిర్బంధించటం ట్రంప్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు

ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల

Updated Date - Jan 04 , 2026 | 07:43 AM