Home » ONGC
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద పైపు లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడం కలకలం రేపుతోంది. పొగ తరహాలో దట్టంగా బయటకు చిమ్ముతున్న గ్యాస్ సమీప ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ వేల్‌కు బీఓపీ ఫిక్స్ చేసిన ఓఎన్జీసీ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు.
బ్లోఅవుట్ ఘటన జరిగిన పరిసరాల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కోనసీమ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఘటన కారణంగా ఆ ప్రాంతాలను వీడిన వారిలో 90 శాతం మంది తిరిగొచ్చారని తెలిపారు.
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచనలు చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్‌పైప్ నుంచి గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో దట్టమైన పొగ వ్యాపించింది.
వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ చమురు రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో భారత చమురు కంపెనీలకు లాభం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెనెజువెలా వ్యవహారాలు అమెరికా చేతుల్లోకి వెళ్లాక భారత్‌కు మేలు కలిగే అవకాశం ఉందని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఆంక్షలు తొలగిపోతే ఓఎన్‌జీసీ బాకీ వసూలు కావడంతో పాటు అక్కడి ఆయిల్ ఫీల్డ్స్‌లో చమురు వెలికితీత పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.
యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
జిల్లాలోనిరాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు సమీపంలో ఓఎన్జీసీ పైపు నుంచి గ్యాస్ లీకవడం కలకలం రేపుతోంది.