Gas Leak: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:28 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్‌పైప్ నుంచి గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో దట్టమైన పొగ వ్యాపించింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం (Malikipuram) మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ పైపులైన్ (ONGC Pipeline) నుంచి గ్యాస్ లీకై భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గ్యాస్ గాలిలోకి ఎగజిమ్మడంతో ఒక్కసారిగా మంటలు (Fire) చెలరేగాయి. అది చూసి గ్రామస్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మండల తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పని మొదలు పెట్టారు.
మలికిపురం మండలంలో గ్యాస్ లీకేజ్ విషయంపై మంత్రి సుభాష్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే మంటలను అదుపు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ఆగస్టులోనూ ఇదే గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ అయ్యింది. ఇక్కడ తరుచూ గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు జరుగుతుండడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా దీని వల్ల తీవ్ర ప్రమాదం జరగొచ్చని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని.. లేదంటే గ్రామ ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓఎన్‌జీసీ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు కంట్రోల్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News