CM Chandrababu: ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:05 PM
ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏపీ కీలక మైలురాయి సాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టులో కొత్త రెసిడ్యూ అప్‌గ్రెడేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏపీ కీలక మైలురాయి సాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టు (VRMP)లో కొత్త రెసిడ్యూ అప్‌గ్రెడేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మూడు రియాక్టర్లలో ఒకటిగా ఏర్పాటు అయిందని వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన అవసరాలకు ఇది సమగ్ర పరిష్కారమని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతమిస్తోందని తెలిపారు. దేశ ఇంధన భద్రత బలోపేతమే లక్ష్యంగా పని చేస్తోందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు తీర ప్రాంతం ప్రపంచస్థాయి రిఫైనింగ్ హబ్‌గా అవతరించనుందని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా కేంద్రమంత్రి హర్ధీప్ సింగ్ పూరి పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ పెట్టారు సీఎం చంద్రబాబు.
ఆత్మనిర్భర్ భారత్‌కు బలమైన అడుగు: కేంద్రమంత్రి హర్ధీప్ సింగ్ పురీ
విశాఖపట్నం రిఫైనరీలో HPCL రెసిడ్యూ అప్‌గ్రెడేషన్ ఫెసిలిటీ (RUF) విజయవంతంగా ప్రారంభమైందని కేంద్రమంత్రి హర్ధీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. దేశ ఇంధన భద్రత దిశగా భారత్ మరో కీలక మైలురాయి సాధించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ కీలక మౌలిక వసతి ప్రాజెక్టు ఆత్మనిర్భర్ భారత్‌కు బలమైన అడుగని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు అమలు అయిందని వివరించారు. పూర్తిగా దేశీయ సాంకేతికతతో నిర్మితమైన రెసిడ్యూ అప్‌గ్రెడేషన్ ఫెసిలిటీ అత్యాధునిక ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పుకొచ్చారు హర్ధీప్ సింగ్ పూరి.
ఈ ప్రాజెక్టులో ఒక్కోటి సుమారు 2,200 మెట్రిక్ టన్నుల బరువున్న 3 LC-Max రియాక్టర్లు – ప్రపంచంలోనే అత్యంత భారీ ఇంజినీరింగ్ బ్లాక్స్‌లో ఒకటని వెల్లడించారు. రియాక్టర్ల తయారీ, అసెంబ్లీంగ్ పూర్తిగా భారత్‌లోనే జరిగిందని వివరించారు. సంవత్సరానికి 3.55 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) సామర్థ్యంతో RUF పనిచేస్తుందని తెలిపారు. ఆధునిక రెసిడ్యూ హైడ్రోక్రాకింగ్ టెక్నాలజీ ద్వారా 93 శాతం దిగువ స్థాయి చమురును విలువైన ఉత్పత్తులుగా మారుస్తుందని అన్నారు. ప్రతి బ్యారెల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించి దేశ అభివృద్ధికి ఇంధనంగా వినియోగించవచ్చని తెలిపారు. తూర్పు తీరాన్ని ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్‌గా నిలబెట్టే కీలక ప్రాజెక్టు ఇదని వెల్లడించారు. ఈ సందర్భంగా #NewIndia #EnergyTransition హ్యష్ ట్యాగ్‌లతో కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ పూరి ట్వీట్ పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో దొంగతనానికి యత్నించి..
ప్రయాణికులకు అలర్ట్.. విమానాల రాకపోకలకు ఆలస్యం
Read Latest AP News And Telugu News