Tirupati Theft Case: రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో దొంగతనానికి యత్నించి..
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:04 AM
తిరుపతి జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పాకాల మండలంలో గల కొనపరెడ్డిపల్లి శ్రీరామాలయం వద్ద చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు దొంగలను స్థానిక గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తిరుపతి, 5 జనవరి 2026: తిరుపతి జిల్లాలో(Tirupati District) దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పాకాల మండలంలో గల కొనపరెడ్డిపల్లి రామాలయం వద్ద చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు దొంగలను స్థానిక గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది.
చోరీకి యత్నం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాలయం దగ్గర అలికిడి కావడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు మెలకువగా ఉండి ఆలయం దగ్గర భద్రత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దొంగలు చోరీకి యత్నించడంతో దొంగలను పట్టుకున్నారు. ఆలయం దగ్గర చోరీ కోసం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే దొంగలను పాకాల పోలీసులకు అప్పగించారు.
దొంగల వివరాలు
దొంగల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఒకరు పులిచెర్ల వాసి కాగా, మరొకరు చిత్తూరులోని సంతపేటకు చెందిన వ్యక్తి. మూడో వ్యక్తి ఒక బయటి ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉప్పువంక వద్ద వారు కూలిపనులు చేసుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
గత చోరీ కేసులు
ఈ ముగ్గురు దొంగలపై గతంలోనూ చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇదే పనిగా వారు చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. దొంగలను అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ చేపట్టామని పాకాల పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Read Latest AP News And Telugu News