Share News

Rayalaseema Lift Dispute: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ

ABN , Publish Date - Jan 04 , 2026 | 10:11 AM

తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అయితే సీఎం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో సీఎం నారా చంద్రబాబునాయుడు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని ఏపీ సర్కార్ చెబుతోంది.

 Rayalaseema Lift Dispute: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Rayalaseema Lift Dispute

అమరావతి, జనవరి4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఇటీవల మాట్లాడారు. అయితే సీఎం వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది. తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో సీఎం నారా చంద్రబాబునాయుడు (CM Nara Chandrababu Naidu) రాయలసీమ లిఫ్ట్ (Rayalaseema Lift Project) నిలిపివేశారని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమని ఏపీ సర్కార్ తెలిపింది.


మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను నాటి ప్రభుత్వం చేపట్టిందని ప్రస్తావించింది. రాయలసీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ హయాంలో పనులు చేపట్టారని గుర్తుచేసింది. నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్‌‌కు సంబంధించి కోర్టులో కేసులు వేసింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీతో సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేసిందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


2020లోనే ఈ మేరకు ఎన్టీటీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రస్తావించింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేసింది కేంద్రం. చంద్రబాబు సెంట్రిక్‌గా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందేందుకు ఆ రాష్ట్రంలోని అధికార, విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వం విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండబోదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో సహా వాస్తవాలు బయటపెడతామని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేస్తారని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం

ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడొద్దు.. అన్ని హామీలు నెరవేరుస్తాం: నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 04 , 2026 | 10:24 AM