Minister Narayana:ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడొద్దు.. అన్ని హామీలు నెరవేరుస్తాం: నారాయణ
ABN , Publish Date - Jan 04 , 2026 | 06:50 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు.
అమరావతి,జనవరి4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ (Minister Narayana) వ్యాఖ్యానించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారని ప్రస్తావించారు. ఆరునెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తామని భరోసా కల్పించారు. ఈ విషయంలో అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు రైతులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి నారాయణ. రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామస్థుల అభిప్రాయాలను తీసుకున్నారు. రాజధాని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో తమ ప్రభుత్వం మౌలిక వసతుల పనులు చేపడుతోందని వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న ఇతర అవసరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. గ్రామస్థులు అడుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఒక్కొక్క గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో మంత్రి నారాయణ వివరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
గంజాయికి ‘నో’ చెప్పి భవిష్యత్ సురక్షితం చేసుకోండి
Read Latest AP News And Telugu News