Share News

Minister Anitha: గంజాయికి ‘నో’ చెప్పి భవిష్యత్ సురక్షితం చేసుకోండి

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:46 PM

డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేసిన కృషి అంతా ఇంతా కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ నిర్మూలనపై మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇందుకోసం ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Minister Anitha: గంజాయికి ‘నో’ చెప్పి భవిష్యత్ సురక్షితం చేసుకోండి
AP Home Minister Vangalapudi Anitha

శ్రీకాకుళం, జనవరి3 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసుల్లో దొరికితే శిక్షలు కఠినంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) హెచ్చరించారు. చిన్న చిన్న సరదాలకు పిల్లల జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. ఇవాళ(శనివారం) శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభకు హోంమంత్రి అనిత, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. 501 గ్రామాలు, సుమారు 1300 కిలోమీటర్ల మేర పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు అభ్యుదయ సైకిల్ యాత్ర జరిగిందని తెలిపారు.


ఇటీవల ఇండిగో సంక్షోభాన్ని హ్యాండిల్ చేయలేదని రామ్మోహన్ నాయుడుపై ఆరోపణలు వచ్చాయని ప్రస్తావించారు. కానీ వారం రోజుల్లో ఆయన పరిస్థితిని పరిష్కరించారని చెప్పుకొచ్చారు. ఆ వారం రోజులు ఆయన పడిన కష్టం తనకు తెలుసునని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేసిన కృషి అంతా ఇంతా కాదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ నిర్మూలనపై మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. దాని కోసం ఈగల్ అని ఒక ప్రత్యేక డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు హోంమంత్రి అనిత.


జీరో నుంచి మొదలు పెట్టి గంజాయి నిర్ములన చేశామని తెలిపారు. ఇబ్బందిగా ఉంటుందని తెలిసినా చాలా విషయాల్లో పిల్లలకు డ్రగ్స్‌పై నో చెప్పడం రాదని అన్నారు. నో చెప్పడం మొదలు పెడితే మార్పు కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో అడుగడుగునా గంజాయి తనిఖీలు జరిగాయని తెలిపారు. తాము పని చేస్తే సరిపోదని.. పిల్లల్లో కూడా అవగాహన రావాలని అన్నారు. పిల్లలు వారి భవిష్యత్‌ని సన్మార్గంలో పెట్టుకోవాలని కోరారు. ఎవరి భవిష్యత్ వారి చేతుల్లోనే ఉంటుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అదనంగా ప్రోత్సహకాలు ఇవ్వాలి: మాధవ్

చంద్రబాబు దార్శనికత, లోకేశ్ నిబద్ధతతో పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానంలో..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 06:15 PM