తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. వైసీపీ నేతలు గుబులు రేగుతోంది. నెలరోజుల కిందట తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే కొనసాగుతుందని వైసీపీ నేతలు భావించారు.
వజ్రపుకొత్తూరు మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధిలో అధిక విస్తీర్ణంలో కొండలు ఉన్నాయి. ఈ కొండలపై స్థానిక నాయకుల కన్ను పడింది. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు నాయకులు ఒక్కటై యథేచ్ఛగా కొండలను తవ్వేసి రాళ్లు, కంకరను అమ్ముకుంటున్నారు.
ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెబుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ బీఎల్వోల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్ తుఫాన్ ముప్పు భయం వెంటాడు తోంది. తుఫాన్ ప్రభావంతో సోమవారం నుంచి మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటిం చింది.
పట్టణంలోని ఇందిరానగర్ సూర్య అపార్ట్మెంట్లో ఐదో అంతస్థులో ఉన్న దంతవైద్యుడు గురుదేవ్ ఇంటిలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్ప డ్డారు. 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదును అపహరించినట్లు వైద్యు డు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.
పరిపాలనాధక్షుడు, విజన్ కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును గెలిపించి రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ కోరారు.
పెళ్లయిన మూడు నెలలకే ఓ నవ వధువు మృతి చెందిన ఘటన పలాస-కాశీబుగ్గలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
శ్రీకాకుళం-1, 2 డిపోల నుంచి వివిధ మార్గాల్లో నడుపుతున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులో ప్రయాణం చేసి గిఫ్ట్ స్కీంలో ఎంపికైనవారికి ఆదివారం శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్ శర్మ బహుమతులను అందజేశారు.
విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ బీఎల్వోలకు సూచించారు. ఆదివారం మఖరాంపురం ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.
దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, సంకాల్పనికి వైకల్యం అడ్డుకోలేదని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.