పలాసను జిల్లాగా ప్రకటించాలి
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:19 AM
పలాసను జిల్లాగా ప్రకటించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాత్రి స్థానిక ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ రోడ్డులో అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, వివిధ ప్రజాసంఘాల గౌరవాధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ టెక్కలి, పలాస, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని మండలాలను పలాసలో చేర్చి జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద న్నారు.
పలాస, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పలాసను జిల్లాగా ప్రకటించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాత్రి స్థానిక ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ రోడ్డులో అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, వివిధ ప్రజాసంఘాల గౌరవాధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ టెక్కలి, పలాస, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని మండలాలను పలాసలో చేర్చి జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద న్నారు. దువ్వాడ శ్రీధర్ మాట్లాడుతూ పలాస జిల్లాసాధనకు పోరాటం చేస్తామని, ప్రజల మద్దతుఉందనితెలిపారు.త్వరలో సాధనకమిటీ నియ మించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.కార్యక్రమంలో కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ,వామపక్ష పార్టీల నాయకులుడాక్టర్ దువ్వాడ జీవితేశ్వర రావు, వరిశహరిప్రసాద్, పాలవలస వైకుంఠరావు, వంకలమాధవరావు, రామారావు, ప్రజాకళాకారుడు కుత్తుమ వినోద్‌కుమార్, ఎన్‌జీవో బోనెలగోపాల్, న్యాయవాది బి.కామేశ్వ రరావుపట్నాయక్, కళాకారుడు కుమార్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.