Share News

గొర్రెలమందపై మళ్లీ కుక్కల దాడి

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:17 AM

Five goats die in Konchada పొందూరు మండలం కొంచాడలో కుక్కల దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 2న కురమాన రమణ, గౌరునాయుడుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా.. 42 గొర్రెలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరోసారి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి.

గొర్రెలమందపై మళ్లీ కుక్కల దాడి
మృతిచెందిన మేకపిల్లల వద్ద బాధితులు

కొంచాడలో ఐదు మేకలు మృతి

మూడు రోజుల క్రితం 42 గొర్రెలు..

అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం

పొందూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పొందూరు మండలం కొంచాడలో కుక్కల దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 2న కురమాన రమణ, గౌరునాయుడుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా.. 42 గొర్రెలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరోసారి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో పల్ల సింహాచలానికి చెందిన ఐదు మేకలు మృతి చెందాయి. 12 మేకలకు తీవ్ర గాయాలయ్యాయి. మేకల మందలోకి పదుల సంఖ్యలో కుక్కలు చొరబడి దాడి చేశాయని సింహాచలం కన్నీటిపర్యంతమయ్యారు. కుక్కలు దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషులపై దాడి చేస్తే ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:17 AM