విద్యను నిర్లక్ష్యం చేయరాదు: కలెక్టర్
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:16 AM
విద్యను నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. గురువారం శ్రీకాకుళం రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెస్ట్ సంగ్యాన్ వార్షిక సంబరాలు ముగిశాయి.
పాత శ్రీకాకుళం, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): విద్యను నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. గురువారం శ్రీకాకుళం రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెస్ట్ సంగ్యాన్ వార్షిక సంబరాలు ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహిం చిన వేడుకల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఇటువంటి భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించాలంటే టీమ్ వర్క్‌తో సాధ్యమని తెలిపారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానంచేశారు.సంగ్యాన్ నాలుగురోజులు కార్యక్రమాల్లో భాగంగాసాయంత్రం వైద్యులు నిర్వహించిన ఫ్యాషన్ ఫో, నృత్యాలు, గీతాలాపనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైజాగ్ నెఫ్రాలజిస్ట్ టి.రవిరాజు, ప్రిన్సిపాల్ ఎస్.అప్పలనాయుడు, వైస్ ప్రిన్సిపాళ్లు కె. సునీల్ నాయక్,రాము, ఆర్గనైజింగ్ సభ్యులు కె .భాస్కరరావు, అచ్యుతరావు, చిన్న పిల్లలు వైద్యులు హరీష్, జ్యోస్న, పి.కారణ్, సిబ్బంది పీజీ, యూజీ విద్యార్థులు పాల్గొన్నారు.