ఇంటికి చేరేలోపే..
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:35 AM
మరికాసేపట్లో తన ఇంటికి చేరుకుంటాడను కున్న ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి స్పృహతప్పి మృతి చెందిన ఘటన గురువారం పాతప ట్నంలో చోటుచేసుకుంది.
అనారోగ్యంతో వ్యక్తి మృతి
పాతపట్నం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మరికాసేపట్లో తన ఇంటికి చేరుకుంటాడను కున్న ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి స్పృహతప్పి మృతి చెందిన ఘటన గురువారం పాతప ట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గుసాని బ్లాక్ లింగుపురం గ్రామానికి చెందిన నరేంద్ర రొంగని(47) హైదరాబాద్ వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ స్వగ్రామం లో ఉన్న తన కుటుంబాన్ని పోషించుకుం టున్నాడు. ఈ క్రమంలో నరేంద్ర అనారోగ్యా నికి గురైయ్యాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇంటికి వచ్చే యాలని భార్య పిల్లలు చెప్పారు. దీంతో హైదరాబాద్ నుంచి ఓ ట్రావెల్స్ బస్సు లో గురువారం పాతపట్నం చేరుకున్నాడు. ఈ క్రమంలో అస్వస్తతకు గురైన నరేంద్ర.. రోడ్డు పక్కనే గల ఓ బెంచిపై కూర్చొని విద్యుత్ స్తంభాన్ని ఆనించి తల వాల్చాడు. అయితే ఎంతసేపైనా లేవకపోడంతో అక్కడివారు గుర్తించి పోలీ సులకు సమాచారమిచ్చారు. సీఐ ఎన్.సన్యాసినాయుడు సిబ్బందితో ఘటనా స్థ లానికి చేరుకుని పరిశీలించి, నరేంద్రను స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బ్యాగ్‌లో ఉన్న వివరాలు ఆధారంగా న రేంద్ర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నరేంద్ర భార్య మాలతి ఫి ర్యాదు మేరకు ఏఎస్‌ఐ ఎల్.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదృశ్యమైన వృద్ధుడు మృతి
పాతపట్నం డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఈనెల 2వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఆనంద పొరీడి(69) గురువారం శవమై కనిపించాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. చంగుడి గ్రామా నికి చెందిన ఆనంద పొరీడిఈనెల 2వతేదీ నుంచి కనిపించుటలేదని అతడి కుమారుడు సంతోష్ పొ రీడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా మం డలం సరాళి గ్రామ చేరువలో మహేంద్ర తనయ నదిలో శెగిడివీధి రేవు వద్ద గురువారం శవమై కనిపించాడు. చిన్నకుమారుడు సునీల్ పోరీడి గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం మిచ్చారు. కాగా ఆనంద పోరీడి ఫిర్యాదుమేరకు ఏఎస్‌ఐ కె.శ్రీరామ్మూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లగేజీ వ్యాన్ ఢీకొని టైల్స్ మేస్త్రీ..
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): నగరంలో లగేజీ వ్యాన్ ఢీకొనడంతో గురువారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామానికి చెందిన పంచిరెడ్డి శ్రీనివాసరావు (45) టైల్స్ మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం బొంతలకోడూరు తన ఇంటిలో భోజనం ముగించుకొని పని నిమిత్తం అరసవల్లి తన ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. మిల్లు జంక్షన్ నుంచి అరసవల్లి దేవాలయానికి వెళ్లే రహదారిలో వెనుక నుంచి వచ్చి లగేజీ వ్యాన్ ఢీకొనడంతో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ట్రాఫిక్ ఎస్‌ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆటో ఢీకొనడంతో ఒకరు..
గార, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): చల్లపేట రోడ్డు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అరసవల్లికి చెందిన సాధు రాజారావు (50) మృతి చెందాడు. ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు కథనం మేరకు.. తాపీ పనిచేస్తూ జీవిస్తున్న రాజారావు ద్విచక్రవాహనంపై అరసవల్లి వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించుకొని ముందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో రాజారావుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనం వెనుక కూర్చొన్న ముడిదాన శ్రీను స్వల్పంగా గాయపడ్డాడు. శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.