ప్రతి కుటుంబానికి అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:32 AM
ఆపదలో ఉండే ప్రతీకుటుంబానికి కూటమి ప్ర భుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామి డి గోవిందరావు తెలిపారు.
ఎమ్మెల్యే గోవిందరావు
పాతపట్నం, డిసెంబరు 4(ఆంద్రజ్యోతి): ఆపదలో ఉండే ప్రతీకుటుంబానికి కూటమి ప్ర భుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామి డి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యా లయంలో హిరమండలం మండల గులు మూరు గ్రామానికి చెందిన మజ్జి భాగ్యలక్ష్మికి మంజూరైన రూ.1లక్ష సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గురువారం ఎమ్మెల్యే అందజేశారు. భాగ్యలక్ష్మి భర్త బుజ్జి అనారోగ్యానికి గురై వైద్యసేవలు పొందుతూ ఇటీవలే మృతిచెందాడు. వైద్య సేవలకు అధిక మొత్తంలో వెచ్చించినా బజ్జి మృతి చెందాడు. దీంతో ఆర్థికంగా చితికి పో యిన ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఆశ్ర యించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సీ ఎంఆర్‌ఎఫ్ సహాయనిధికి దరఖాస్తు చేయించ డంతో సాయం మంజూరైంది. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
- స్థానిక షిర్డీ గిరిపై సాయినాథ్ ధ్యాన మంది రంలో గురువారం నిర్వహించిన దత్తాత్రేయ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేసి, అన్నప్రసాదసేవలో పాల్గొన్నారు.
- ఎంపీ ల్యాడ్స్ ద్వారా మెళియాపుట్టిలోని క్రీడామైదాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మెళియాపుట్టి మండల నాయకులు, యువత మర్యాద పూర్వకంగా కలుసుకున్ని తమ ఇబ్బందులు వివరించారు. సామాజిక భవనం నిర్మించాలని పొందర కులస్థులు వేడుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అనపాన రాజవేఖరరెడ్డి, యూత్ సభ్యులు నగేష్ శంకర్ ఢిల్లీ బృందావన్ మణి తదిరతులు పాల్టొన్నారు.