Share News

స్థలాలు లేక.. పార్కింగ్‌కు బేజారు

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:17 AM

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. స్థలాలు లేకపోవడంతో పార్కింగ్‌కు అగచాట్లు తప్పడం లేదు. వాహనాల సంఖ్యతోపాటు జనాభా పెరిగినారోడ్లు విస్తరించడంలేదు. ప్రస్తుత అవసరా లకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో రద్దీ పెరిగితే ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.

 స్థలాలు లేక.. పార్కింగ్‌కు బేజారు
కేటీ రోడ్డులో డివైడర్‌ మధ్యలో పార్కింగ్‌ ఏర్పాటుచేసిన దృశ్యం

కాశీబుగ్గ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. స్థలాలు లేకపోవడంతో పార్కింగ్‌కు అగచాట్లు తప్పడం లేదు. వాహనాల సంఖ్యతోపాటు జనాభా పెరిగినారోడ్లు విస్తరించడంలేదు. ప్రస్తుత అవసరా లకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో రద్దీ పెరిగితే ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.

జంటపట్టణాలు వాణిజ్యపరంగా విస్తరిస్తున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా వసతులు మాత్రం సమకూరడంలేదు. ప్రధానంగాపార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో వాహనచోద కులు అవస్థలుపడుతున్నారు. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు జీటీ రోడ్డులో రోడ్డులో సెంట్రర్‌ పార్కింగ్‌ ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో ప్రధానంగా మూడు రోడ్ల జంక్షన్‌, రైల్వేగేటు, ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఇందిరా చౌక్‌ల వద్ద వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, ఆస్పత్రులు, లాడ్జీలు, కళ్యాణమండపాలు ఎక్కువగా ఉన్నాయి.చాలాచోట్ల సెట్‌ బ్యాక్‌, పార్కింగ్‌, రిజర్వ్‌ స్థలాలు లేవు. ఆపై పశువుల సంచారం అధికంగా ఉండడంతో జంట పట్టణాలు అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 64 వేలు జనాభా నివసిస్తున్నారు. అనధి కారికంగా లక్షవరకూ ఉండే అవకాశముంది. రోజుకు సగటున జంట పట్టణాల్లోకి మూడు నుంచి నాలుగు వేల వరకూ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు 30 వరకూ వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. దీంతో వాహనాల తాకిడి అధికంగా ఉంటోంది.కానీ పార్కింగ్‌ స్థలాలు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. దీంతో వాహనచోదకులు జీటీ రోడ్డు మధ్యలో, పాత బస్టాండ్‌ ప్రాంగణంలో, సంతప్రాంగణంలో వాహనాలను పార్కింగ్‌చేయాల్సివస్తోంది. వాణిజ్య సముదాయాల ఎదుట అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతుండడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతిశుక్రవారం వారపు సంత జరుగుతోంది. ఆ సమయంలో వాహనాలను అడ్డదిడ్డంగా నిలుపుతుండడంతో ట్రాఫిక్‌ సమ స్యలు తలెత్తుతున్నాయి.

Updated Date - Dec 05 , 2025 | 12:17 AM