మారుమూల గ్రామాల్లో రేషన్ దుకాణాలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:33 AM
మారుమూల గ్రామా ల్లో పేదల కోసం చౌకధరల దు కాణాలు ఏర్పాటు చేస్తు న్నట్టు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
హరిపురం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామా ల్లో పేదల కోసం చౌకధరల దు కాణాలు ఏర్పాటు చేస్తు న్నట్టు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మందస మండలం బాలిగాం పంచాయ తీ వీరభద్ర గ్రామంలో నూతన చౌకధరల దుకాణాన్ని గురువారం ఆమె ప్రారంభిం చి మాట్లాడారు. ప్రస్తుతం రేషన్ దుకా ణాల ప్రతి రోజూ తెరిచి సూపర్ మార్కెట్ల వలే సరుకులు విక్ర యించేలా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీ డీపీ నాయకులు బావన దుర్యోధన, సాలిన మాధవరావు, లబ్బ రుద్రయ్య, తమిరి భాస్కరరావు, బమ్మిడి కర్రయ్య, మామిడి తాతారావు, గొర్లె హరీష్, నారయణ, నవీన్, బి.తారక్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
పలాస, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. శుక్ర వారం దత్తజయంతి సందర్భంగా స్థానిక నెమలికొండ దత్తాశ్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక పూజలు జరిపారు. దత్తాత్రేయ ఆల యంలో దత్తదర్శనం చేసుకున్న అనంతరం య జ్ఞకార్య క్రమంలో పాల్గొన్నారు. అనంతరం దత్తపీఠాదిపతి సదానందస్వామి ఆశీసులు తీసుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. అలాగే దత్తఆశ్రమం నుంచి నెమలినారాయణపురం గ్రామానికి రూ.11 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు, టీడీపీ నాయకులు లొడగ ల కామేశ్వరరావుయాదవ్, వజ్జ గంగాభవాని, మల్లా శ్రీనివాస్, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, ఎం.నరేంద్ర, దువ్వాడ శ్రీకాంత్, పీరుకట్ల విఠల్‌రావు పాల్గొన్నారు.