Home Minister Anitha: చంద్రబాబు దార్శనికత, లోకేశ్ నిబద్ధతతో పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానంలో..
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:56 PM
జగన్ హయాంలో వేధింపులు, కక్ష సాధింపులతో పాలన పతనావస్థకు చేరిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తుందని వెల్లడించారు.
అమరావతి, జనవరి3 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా నిలవడంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు, మంత్రి నారా లోకేశ్ నిబద్ధతకు నిదర్శనంగా.. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందని వ్యాఖ్యానించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా – CMIE విడుదల చేసిన నివేదిక ప్రకారం 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు హోంమంత్రి అనిత.
2025 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వాటా గణాంకాలు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో వేధింపులు, కక్ష సాధింపులతో పతనావస్థకు చేరిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తుందని వెల్లడించారు హోంమంత్రి అనిత.
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో సిస్టమ్ వంటి సంస్కరణల ద్వారా పెట్టుబడిదారుల్లో పెరిగిన నమ్మకమే రాష్ట్రాన్ని టాప్ ప్లేస్‌కు చేర్చడంలో కీలకంగా నిలిచిందని వివరించారు. కేవలం 18 నెలల్లో ఏపీకి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 26 లక్షల ఉద్యోగ అవకాశాలను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అదనంగా ప్రోత్సహకాలు ఇవ్వాలి: మాధవ్
తెలంగాణలో అభివృద్ధి జాడేది.. కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్
Read Latest AP News And Telugu News