Kavitha: తెలంగాణలో అభివృద్ధి జాడేది.. కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:59 PM
తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని.. అయిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపణలు చేశారు.
సూర్యాపేట, జనవరి3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని.. అయిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపణలు చేశారు. ఇవాళ(శనివారం) సూర్యాపేట జిల్లాలో జనం బాటలో భాగంగా కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కవిత.
సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడవి అక్కడే ఆగిపోయాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్లా అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై తాను దృష్టి పెట్టానని చెప్పుకొచ్చారు. అర్వపల్లి మండలంలోని కేజీవీబీ స్కూల్‌ను పరిశీలించానని తెలిపారు. గత ఏడాదిలో తుపాను వచ్చి ఈ స్కూల్ మునిగిపోతే కలెక్టర్ వచ్చి పరిశీలించారని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు కవిత.
రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ సరిగా లేదని అన్నారు. కాల్వల్లో కంప చెట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. నీళ్లు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా అని ఫైర్ అయ్యారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాల్వ 70 కిలోమీటర్లు ఉంటుందని... ఈ కాల్వను సరిగా మెయింటెనెన్స్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. రుద్రమదేవి చెరువు పరిశీలించానని....700 ఎకరాల్లోని ఈ చెరువుకు గోదావరి నీళ్లు రావాల్సి ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజ్- 2లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేలా రిజర్వాయర్లు కట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించాలని కవిత కోరారు.
ఇవి కూడా చదవండి...
అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి
ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం: సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్
Read Latest Telangana News And Telugu News