నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar ) నీటి వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్‌ను హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ( Ajay Bhalla ) నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సీఎస్‌లు, డీజీపీలు, సీడబ్ల్యూసీ అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు.
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ రాష్ట్ర పోలీసులు మోహరించారు. ఇటు తెలంగాణ పోలీసులు డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్నారు.
Telangana: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు నిర్వహించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాగర్ ప్రాజెక్టు వద్దకు ఏపీ పోలీసులు భారీగా చేరుకున్నారు. అర్ధరాత్రి ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించారు. నాగార్జునసాగర్ డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ 13వ నంబర్ గేటు వరకూ ఏపీ పోలీసులు వెళ్లారు.
యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు.
హైదరాబాద్: ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నల్గొండ జిల్లా, కోదాడకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు.
లంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కేంద్ర అగ్ర నాయకులు సీఎం కేసీఆర్‌పై దండయాత్రలా వస్తున్నారని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని విమర్శించారు.
నల్గొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్‌లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు.
యాదాద్రి: కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులరద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
సూర్యాపేట: కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగధీష్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్‌ను ఓడించేందుకే తనకు టిక్కెట్ ఇవ్వలేదని అన్నారు. సూర్యాపేట్‌లో గెలిచేది రమేష్ రెడ్డి అని చిన్న పిల్లలు, సర్వేల్లో కూడా తేలిందన్నారు.