ధర్మాపురం లో నీటి కుక్క
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:31 AM
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలోని పెద్దరామక్క చెరువులో శుక్రవారం గ్రామస్తులకు నీటి కుక్క కనిపించింది.
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలోని పెద్దరామక్క చెరువులో శుక్రవారం గ్రామస్తులకు నీటి కుక్క కనిపించింది. సముద్రాల్లో కనిపించే నీటికుక్క తమ గ్రామ చెరువులో కనిపించడంతో దానిని చూడడానికి గ్రా మస్తులు చెరువు దగ్గరికి పరుగులు పెట్టారు. దీంతో ఆ నీటి కుక్క నెమ్మాదిగా నీటిలోకి జారుకుంది. తమ చెరువులోకి నీటి కుక్క ఎలా వచ్చిందని ఒక వైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరో వైపు నీటి కుక్కను చూశామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ చెరువులో నీటి కుక్కను ఇదే మొదటి సారిగా చూస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
-పెనపహాడ్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి)