నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:38 PM
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది..
నల్లగొండ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లాలో ఇవాళ(శనివారం) భారీ అగ్నిప్రమాదం (Nalgonda District Fire Accident) జరిగింది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని సాయి విఘ్నేశ్వర ఆటోమొబైల్ షాప్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికులు.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.10 లక్షల ఆస్తి నష్టం..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాప్‌లో నుంచి ఒక్కసారిగా పొగ వ్యాపించింది. కాసేపటికే మంటలు వేగంగా వ్యాపించడంతో షాపులో ఉన్న స్పేర్ పార్ట్స్, వాహనాలకు సంబంధించిన సామగ్రి అగ్నికి ఆహుతైంది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే షాప్‌లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
షార్ట్ సర్క్యూట్‌తోనే..!
అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్ వైర్లలో లోపం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ పరికరాలు, వైరింగ్ వ్యవస్థలను తరచూ తనిఖీ చేయించుకోవాలని ఫైర్ సేఫ్టీ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And Telugu News