Home » Kalvakuntla kavitha
కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ మధ్య తలెత్తిన విభేదాలు తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాల నుంచి కవిత సస్పెండ్, రాజీనామ వరకు అంతా కూడా రాజకీయంగా హాట్ టాపిక్గా నిలిచింది.
మెడికల్ కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
సింగరేణి కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిది ఓ ప్రత్యేక స్టైల్ అని చెప్పొచ్చు. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజీయాల్లో తనదై మార్క్ చాటుకుంటున్నారు. జగ్గారెడ్డి రాజకీయాలపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మాట్లుతూ... పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ బడ్టెట్ ఇచ్చి చిన్నచూపు చూస్తున్నదని ఆమె ఆరోపించారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్మీట్ పెడతానని వెల్లడించారు.