అవినీతి పార్టీ బీఆర్‌ఎస్...
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:37 PM
మంత్రి వివేక్‌వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ బీఆర్‌ఎస్ అని, ఆ మాట కేసీఆర్ బిడ్డ కవితనే చెబుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు.
కేసీఆర్ బిడ్డనే స్వయంగా చెబుతున్నది
మంత్రి వివేక్
మెదక్: బీఆర్‌ఎస్ అవినీతి పార్టీ అని కేసీఆర్ బిడ్డ కవితనే చెబుతున్నదని కార్మికశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి వివేక్‌వెంకటస్వామి(Vivek Venkatswamy) విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో మిషన్ భగీరథ పేరిట రూ.65 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మెదక్, రామాయంపేట, నర్సాపూర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర రూ. 8లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తిన రుద్దారని, వడ్డీలకే ప్రతీ నెల రూ. 5వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు.
ప్రజలకు ఏమీ చేయకపోయినా వారి పార్టీకి మాత్రం రూ. వేయి కోట్ల డిపాజిట్లు సేకరించారని, బీఆర్‌ఎస్ నేతలు కూడా ఒక్కొక్కరు రూ. వందల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ 20వేల ఎకరాల భూమిని ఆక్రమించారని విమర్శించారు. కేసీఆర్ ప్రజాధనాన్ని మూడు నియోజకవర్గాల్లోనే ఖర్చు చేశారని, కానీ తాము మాత్రం రాష్ట్రమంతటా సమానంగా అభివృద్ధి చేస్తునన్నామని చెప్పారు. పదేళ్లుగా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని ప్రజలను బీఆర్‌ఎస్ పార్టీ మభ్య పెట్టిందని, తాము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏడుపాయలకు సీఎం రాలేదని.. తాము మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీసుకొచ్చి రూ. 35 కోట్లు నిధులు మంజూరు చేయించామని చెప్పారు. మెదక్ సీఎ్‌సఐ చర్చికి సీఎంను తీసుకొచ్చి రూ. 29.30 కోట్లు ఇప్పించామని గుర్తుచేశారు. రోహిత్‌రావు ఎమ్మెల్యేగా గెలిచాక ఇప్పటి వరకు రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News