Home » Vivek Venkataswamy
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో ఎక్కడా వర్గ పోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. నేతలు అందరం కాంగ్రెస్ బలోపేతం కోసమే పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగు పెంచడానికి 5 ఎకరాలపైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయిల్ పామ్ డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి లేదని.. రైతులు ఆ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు.
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ఇసుక ఆదాయం పెంపుపై టీజీఎండీసీ అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలోని నర్సులకు విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో 'ట్రిపుల్ విన్' ప్రోగ్రాం వివరాలను వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.