Share News

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ABN , Publish Date - May 08 , 2026 | 09:56 AM

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
Minister Jupally Krishna Rao

కొమురం భీం, మే 8: ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. నాటు పడవలపై నదీ ప్రవాహాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.


150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని అన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలకు నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఎల్లుండి(మే 10) తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ పెద్దమనసుతో ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులివ్వాలని కోరారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.


ప్రాణహిత మరుగున పడటానికి కారణం కేసీఆర్: మంత్రి వివేక్

ప్రాణహిత ప్రాజెక్ట్ మరుగున పడటానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ అని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రూ.లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ కూడా నిర్మిస్తామని ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సహకరించాలని మంత్రి వివేక్ కోరారు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌లో అమెరికా వార్ షిప్‌లపై దాడి.. ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం..

తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం: మంత్రి దామోదర రాజనర్సింహ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2026 | 10:22 AM